శర్వానంద్ సినిమాకి ‘మనమే’ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే.!
- June 01, 2024
శర్వానంద్ విలక్షణ నటుడు.. ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో సీరియస్ రోల్స్ చేసేవాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో తనలోని హ్యూమరస్ యాంగిల్ బయట పెట్టి వరుస సక్సెస్‌లు అందుకోవడం మొదలు పెట్టాడు.
దాంతో, మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ‘రణరంగం’, ‘మహా సముద్రం’ వంటి సీరియస్ మూవీస్ చేసి మళ్లీ బోల్తా కొట్టాడు. దాంతో మనసు మార్చుకున్నాడు.
తనకు సక్సెస్ ఇచ్చిన ట్రాక్‌లోనే నడవాలనుకున్నాడు. అలా ‘మనమే’ సినిమా టేకప్ చేశాడు. ఈ సినిమా వచ్చే నెల 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయ్. ఈ క్రమంలోనే తనకు బెస్ట్ ఫ్రెండ్, గ్లోబల్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయించాడు.
మరోవైపు సినిమాకి పాజిటివ్ బజ్ కూడా బాగానే వుంది. కంటెంట్ పరంగానూ ఈ సినిమా ఈ మధ్య సక్సెస్ ఫార్ములాస్‌కి దగ్గరగా వుంది. అన్నట్లు ఈ సినిమా ట్రయాంగిల్ ఎమోషన్‌తో సాగే కథ. ఆ కథలో ఓ భర్త, భార్య, ఓ చిన్న పిల్లవాడు.. వున్నారు. ఈ ముగ్గురి చుట్టూనే కథ నడవబోతోంది. అందుకే ‘మనమే’ అనే పేరు ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టారట.
అన్ని రకాల సెంటిమెంట్లు కలిసొచ్చి సినిమా హిట్టయితే, ఓ వైపు శర్వాకీ, మరోవైపు కృతి శెట్టికీ ఇద్దరికీ అదృష్టం కలిసొచ్చినట్లే.!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!