రత్నమాలగా అంజలి.! ఏమైనా కలిసొసొచ్చిందా.?
- June 01, 2024
అంతవరకూ జస్ట్ టీవీ యాంకర్ అయిన అనసూయలో ఓ ‘రంగమ్మత్త’ దాగుందని ఎవ్వరికీ తెలియదు. లెక్కల మాస్టారు సుకుమార్ ఆ పాత్రను క్రియేట్ చేశాడు. ఆ పాత్రకు అనసూయ ప్రాణం పోసేసింది.
అంతేకాదు, ఆ పాత్రతో అనసూయ పాపులారిటీ సైతం అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత అనసూయ రేంజే మారిపోయింది. వరుస అవకాశాలూ, వరుస సక్సెస్లు, అనసూయ ప్రధాన పాత్రలో అనేక సినిమాలూ.. ఇలా మారిపోయింది ఒక్క పాత్రతో అనసూయ కెరీర్.
ఇప్పుడు అదే తరహా పాత్రను తలపుకు తెచ్చేలా అంజలి నటించింది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో. రత్నమాల అనే వేశ్య పాత్ర పోషించిన అంజలి పాత్ర హీరో పాత్రకి చాలా సన్నిహితంగా మసలుతుంటుంది. దాదాపు హీరోయిన్ రోల్కి సమానంగా.
అయితే, ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టితో పోల్చితే, అంజలి సీనియర్ హీరోయిన్. ఇమేజ్ వున్న నటి. సో, ఈ పాత్రతో అంజలికి కొత్తగా కలిసొచ్చేదేముంటుంది. ఆల్రెడీ హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించింది. సోలో హీరోయిన్గా ‘గీతాంజలి’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తదితర సినిమాల్లోనూ నటించేసింది. కొన్ని వెబ్ సిరీస్లు కూడా.
సో, అంజలికి ఈ పాత్రతో కొత్తగా కలిసొచ్చేదేముంటుంది.! అసలు అంజలి ఈ పాత్రను ఎందుకు ఎంచుకుంది.? అందుకోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని ఇండస్ర్టీ ఇన్ సైడ్ టాక్.!
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







