కార్తికేయ లిస్టులో మరో హిట్టు పడిపోయిందిగా.!

- June 01, 2024 , by Maagulf
కార్తికేయ లిస్టులో మరో హిట్టు పడిపోయిందిగా.!

కార్తికేయ మంచి నటుడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానే నటించేశాడు. అది కూడా అజిత్ వంటి ఓ పవర్ ఫుల్ కటౌట్ వున్న నటుడితో పోటీగా. ‘వలిమై’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

నువ్వా నేనా అన్నట్లుగా ఆ సినిమాలో అజిత్‌తో విలనిజం చూపించాడు. ‘భజే వాయు వేగం’ అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా స్ర్కీన్‌ప్లే టైటిల్‌కి తగ్గట్లుగానే రేస్ స్పీడుతో పరుగెత్తించడంతో సగటు ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అయ్యింది.

దాంతో, కార్తికేయ లిస్టులో ‘భజే వాయు వేగం’ పేరుతో మరో హిట్టు చేరిపోయింది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయ్. మంచి రైటింగ్స్, రేటింగ్స్ పడ్డాయ్.

సో, హాట్ సమ్మర్లో కూల్ మూవీగా ‘భజే వాయు వేగం’ సక్సెస్ లిస్టులో చేరిపోయింది. కార్తికేయకు ఇది మంచి టైమింగే. ఎలాగూ హీరోగానే కాకుండా డిఫరెంట్ పవర్ ఫుల్ రోల్స్‌లోనూ కార్తికేయ మెప్పించగలడు. ఏమో ఏం చెప్పగలం.! ఏ మెగా హీరో సినిమాకో విలన్‌గా సెట్ అయిపోయినా అయిపోతాడు.

లేదంటే, కార్తికేయను నమ్మి, మంచి ప్రొడక్షన్ బ్యానర్ ముందుకొచ్చి ఓ బారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ని ప్లాన్ చేసినా చేయాలనుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com