'ప్రేమికుడు 17న విడుదల..

- June 10, 2016 , by Maagulf
'ప్రేమికుడు 17న విడుదల..

మానస్‌ ఎన్., సనమ్‌శెట్టి జంటగా ఎస్‌.ఎస్‌. సినిమాస్‌ పతాకంపై లక్ష్మీనారాయణరెడ్డి కె., ఇసనాక సునీల్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ప్రేమికుడు'. కళాసందీప్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల పాటలు విడుదలయ్యాయి. 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ''సెన్సార్‌ పనులు ఇటీవలే ముగిశాయి. పోస్టర్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గత వారం రోజులుగా అన్ని మ్యూజిక్‌ చానల్స్‌లో మా పాటలు వినిపిస్తున్నాయి. చక్కని ప్రేమకథతో, అలరించే వినోదంతో తయారైన మా సినిమా కచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, ఛాయాగ్రహణం: శివ కె., కూర్పు: మధు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వరికుంట్ల సురేశబాబు, కథ, స్ర్కీనప్లే, దర్శకత్వం: కళాసందీప్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com