పూర్తిగా తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం..
- June 04, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ కాంట్రవర్శియల్ జ్యోతిష్యుడు ఎవరు అంటే తొలుత చెప్పే పేరు వేణు స్వామి. సినిమా సెలబ్రిటీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఆయన ప్రిడిక్షన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఆయన జ్యోతిష్యాలు తప్పైనప్పుడు నెట్టింట ట్రోల్స్ కూడా గట్టిగానే కనిపిస్తాయి. ఇక ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారంటూ.. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వాఖ్యానించిన వేణు స్వామి.. తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. 79 సీట్లలలో వైసీపీ వన్ సైడ్‌గా గెలుస్తుందని.. 30 నుంచి 40 సీట్లలలో టఫ్ ఫైట్ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. 95 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు.
అయితే.. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు వేణుస్వామి చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో చేసేదేం లేక తాను చెప్పిన జాతకం తప్పైంది అంటూ ఆయన సీన్‌లోకి వచ్చారు. తన విద్వత్తు, నాలెడ్జ్ ఉపయోగించి.. జాతకాన్ని బేస్ చేసుకుని.. జగన్ గురించి జ్యోతిష్యం చెప్పానని.. అది 100 శాతం తప్పైందని ఒప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!