మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం
- June 04, 2024
అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ విజయం సాధించారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో గెలిచారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 2 సార్లు గెలిచింది.అది కూడా 1983, 1985ల్లో టీడీపీ గెలిచింది. అంతే కాకుండా ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. దీంతో టీడీపీ సైతం పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకే మంగళగిరి సీటును కేటాయిస్తూ వచ్చింది.
2019లో మంగళగిరిలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన లోకేశ్ వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పద్మశాలీలు టీడీపీకి ఓటేయబోమని ప్రకటించడం లోకేశ్‌కు ప్రతికూలమైంది. మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!