కార్మిక చట్టాల ఉల్లంఘన.. 154 మందిపై బహిష్కరణ వేటు

- June 04, 2024 , by Maagulf
కార్మిక చట్టాల ఉల్లంఘన.. 154 మందిపై బహిష్కరణ వేటు

మనామా: చట్టవిరుద్ధమైన ఉపాధి పద్ధతులకు వ్యతిరేకంగా బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) విస్తృతమైన తనిఖీలను చేపట్టింది. ఒకే వారంలో వెయ్యి తనిఖీలను చేసింది. ఈ సందర్భంగా 50 మంది కార్మికులను అరెస్టు చేసారు. చట్టాలను ఉల్లంఘించిన 154 మంది వ్యక్తులను బహిష్కరించినట్టు వెల్లడించారు.  మే 26 మరియు జూన్ 1 మధ్య  అన్ని గవర్నరేట్‌లలో వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని 1,192 తనిఖీలు, ప్రచారాలను నిర్వహించినట్లు వెల్లడించింది.  ఏదైనా లేబర్ మార్కెట్ ఉల్లంఘనలు లేదా అక్రమ ఉపాధిని వారి వెబ్‌సైట్ (www.lmra.gov.bh), కాల్ సెంటర్ 17506055 లేదా జాతీయ సూచనలు మరియు ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా నివేదించాలని అథారిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com