తెలంగాణ కెనడా సంఘం(TCA),టొరంటో లో అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ వేడుకలు
- June 05, 2024
టోరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ ధామ్ పేరుతో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1800 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు.
ఈ సంబరాలు కమిటీ సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర ప్రారంభించగా, స్వాతి మన్నెం, అమృత దీప్తి కర్రి, కవిత తిరునగరి, ప్రసన్న మేకల మరియు స్ఫూర్తి కొప్పు జ్యోతి ప్రజ్వలన చేయగా కుమారి ఐక్య ఏర్ర గణేష వందనంతో ధూమ్ ధామ్ 2024 సంబరాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వేదిక పై పాల్గొన్నారు.ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతముగా నిర్వహించారు.
ప్రముఖ సినీ నటుడు, రచయిత మరియు దర్శకుడు తనికెళ్ళ భరణి తెలంగాణ ప్రాముఖ్యతని మరియు అభివృద్ధిని కొనియాడుతూ, తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసించు తెలంగాణవాసులకు మరియు సంస్థ శ్రేయోభిలాషులకు వాట్సాప్ ఫోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ధూమ్ ధామ్ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల నాలుగు గంటల పాటు వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు.
ఈ సంబరాలలో కూచిపూడి నృత్యాలయం వారిచే ప్రదర్శించబడిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురుం,గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దం మరియు మరోవేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల విశేష జనాదరణ లభించినది.
అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ TCA ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. TCA ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ ఫుల్ గా ఆర్గనైజ్ చెయ్యడం పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా TCA తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర,సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు-శంకర్ భరద్వాజ పోపూరి, నాగేశ్వరరావు దలువాయి ,ప్రణీత్ పాలడుగు,శ్రీరంజని కందూరి, భగీరథ దాస్ అర్గుల మరియు ప్రవీణ్ కుమార్ సామల ,ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు-ప్రసన్న మేకల మరియు మురళీధర్ కందివనం వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు-కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రావుల్,శ్రీనివాస తిరునగరి,దేవేందర్ రెడ్డి గుజ్జుల,అఖిలేష్ బెజ్జంకి ,కలీముద్దీన్ మొహమ్మద్, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల,విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లి మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగించారు.



తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









