స్మగ్లింగ్ కు చెక్..హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెక్నాలజీ

- June 06, 2024 , by Maagulf
స్మగ్లింగ్ కు చెక్..హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెక్నాలజీ

దోహా: స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు.. తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కస్టమ్స్ అధికారులకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనితో ఖతార్ తన సరిహద్దులను బలోపేతం చేయనుందని  జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఆధ్వర్యంలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ డైరెక్టర్ అజబ్ మన్సూర్ అల్ఖహ్తానీ తెలిపారు. విమానాశ్రయ భద్రతను నిర్వహించడం, అనుమానాస్పద స్మగ్లింగ్‌ను నిరోధించడంలో అధునాతన సాంకేతికత, కస్టమ్స్ అధికారుల నిరంతర నిఘా ద్వారా కీలక పాత్ర పోషిస్తుందని హైలైట్ చేశారు. అనుమానాస్పద పదార్థాలను గుర్తించే పరికరాలు మరియు ట్రాకింగ్ సిస్టమ్‌లకు సంబంధించి అధునాతన విమానాశ్రయాలలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి అని అల్ఖహ్తానీ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com