మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్న ఎన్డీఏ నేతలు..
- June 07, 2024
న్యూ ఢిల్లీ: ఎన్డీఏకు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆ కూటమి నేతలు ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతారు.
ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్డీఏ ఈ ఎన్నికల్లో మొత్తం 293 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కును సాధించలేదు.
బీజేపీ ఈ సారి 240 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ కేంద్ర సర్కారులో కీలకంగా మారుతోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ (12 సీట్లు), ఏక్‌నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ (7) కూడా కేంద్ర సర్కారు ఏర్పాటులో కీలకంగా మారాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!