ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం
- June 08, 2024
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ (IN), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) మధ్య 6వ ఎడిషన్ స్టాఫ్ చర్చలు జూన్ 4 నుండి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సముద్ర ప్రాంతంలో భారత్ - ఒమన్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్టు తెలిపింది. RNO నుండి ప్రతినిధి బృందానికి జాసిమ్ మొహమ్మద్ అలీ అల్ బలూషి నాయకత్వం వహించారు. భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి కమోడోర్ (FC) మన్మీత్ సింగ్ ఖురానా నాయకత్వం వహించారు. రెండు చారిత్రక సముద్ర దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి నేవీ-టు-నేవీ స్టాఫ్ చర్చలు సాగాయని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..