దుబాయ్: ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న 'లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్'

- June 08, 2024 , by Maagulf
దుబాయ్: ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న \'లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్\'

దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన 13వ దుబాయ్ అవార్డ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌పోర్ట్ (DAST) 2024 విజేతలను దుబాయ్ రెండవ డిప్యూటీ రూలర్,  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో సత్కరించారు.సుస్థిర రవాణా పరిష్కారాలు, పర్యావరణ పరిరక్షణ మరియు రవాణా భద్రతను ప్రోత్సహించడం ఈ అవార్డు లక్ష్యం అని నిర్వాహకులు పేర్కొన్నారు.దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుక.. దుబాయ్ అభివృద్ధి, రవాణా పై ప్రభావాన్ని చూపే DAST చిత్రంతో ప్రారంభమైంది.షేక్ అహ్మద్,మత్తార్ అల్ తాయర్‌తో కలిసి వివిధ విభాగాల్లో విజేతలను సత్కరించారు. ఖతార్‌కు చెందిన మొవాసలత్ కర్వా ‘అత్యుత్తమ సుస్థిర రవాణా’ అవార్డును గెలుచుకుంది. అబుదాబిలోని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ 'మొబిలిటీ మేనేజ్‌మెంట్',  'ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ' అవార్డులను అందుకుంది. యూఏఈ లెజెండ్ వరల్డ్‌లోని ఒక ప్రీమియర్ కార్ రెంటల్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇనిషియేటివ్‌ల కోసం ‘ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్’ అవార్డుతో గౌరవించారు.దుబాయ్ మునిసిపాలిటీ ‘ఇనిషియేటివ్స్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్’ అవార్డును గెలుచుకుంది. కైజెంగ్ (స్థాపకుడు & ఛైర్మన్ లెజెండ్ హోల్డింగ్ గ్రూప్), వు (సహ వ్యవస్థాపకుడు & వైస్ చైర్మన్ లెజెండ్ హోల్డింగ్ గ్రూప్) మరియు చెన్నా రెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్ లెజెండ్ వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLC) అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నుండి అవార్డులను అందుకున్నారు.ఈ సంవత్సరం 170 వచ్చాయని వెల్లడించారు. DAST సురక్షితమైన, అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థల కోసం అవగాహన పెంచడం, సమాజ మద్దతును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com