తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్...

- June 08, 2024 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్...

హైదరాబాద్: గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షతో పాటు పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.కొత్తగా ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం వెల్లడించారు.

అంతేకాకుండా వీటితోపాటు ఆరోగ్య శ్రీలో ప్రస్తుతం ఉన్న 1672 చికిత్స విధానాల్లో 1375 ప్రోసీజర్లకు ప్యాకేజీ ధరలు పెంచారు. ఇందుకు అదనంగా మరో వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా, ఈ నిధులను విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణలో ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉండగా, వీరికి ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందుతుంది. తెలంగాణలో 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com