#NBK109 బాలయ్యకి వెరీ వెరీ స్పెషల్.!

- June 11, 2024 , by Maagulf
#NBK109 బాలయ్యకి వెరీ వెరీ స్పెషల్.!

ఓ వైపు రాజకీయాల్లో విజయం సాధించి మరో వైపు సినిమాల్లోనూ కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు నందమూరి బాలయ్య.
ఇదే ఉత్సాహంతో తన 109వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాల్సి వుంది.
ఆ సినిమాని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, బాలయ్య సినిమా కెరీర్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన 109వ చిత్రం లాంఛింగ్ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారట.
అమరావతిలో  ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు, ప్రస్తుతం బాలయ్యకు గుడ్ టైమ్ నడుస్తోంది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. సో, ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో అదీ ఈ టైమ్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
‘వీరమాస్’ అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com