ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
- June 12, 2024
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తన టీం ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రవిచంద్ర నియామకం జరిగిందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బుధవారం లాంఛనంగా కొలువుదీరింది.
బుధువారం విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా… పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుంది.. అని ట్విట్టర్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..