కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్

- June 13, 2024 , by Maagulf
కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్

న్యూ ఢిల్లీ: టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీయే ప్రభుత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పెమ్మసానికి అవకాశం రాగా.. నేడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు.

“ఢిల్లీలోని సంచార్ భవన్ లో కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ (గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి), జ్యోతిరాదిత్య సింథియా (కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ) గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా” అంటూ పెమ్మసాని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com