IAF విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు తరలింపు
- June 14, 2024
కువైట్: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక C-130J రవాణా విమానం కువైట్ నుండి బయలుదేరింది. ఈ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం 10:30 గంటలకు కేరళలోని కొచ్చి చేరుకునే అవకాశం ఉంది. 23 మంది కేరళీయులు, తమిళనాడుకు చెందిన 7 మంది, కర్ణాటకకు చెందిన ఒకరి మృతదేహాన్ని కొచ్చి విమానాశ్రయంలో దింపనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల మృతదేహాలను రవాణా చేయడానికి విమానం ఢిల్లీకి వెళ్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కువైట్ అధికారులతో సమన్వయం చేసి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చారు.
కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఇరవై మూడు మంది కేరళ వాసులు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ జూన్ 13న కువైట్‌లోని ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత చికిత్స పొందుతున్న భారతీయులతో సంభాషించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..