కఫం లేదా శ్లేష్మం నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి.!
- June 21, 2024
తీవ్రమైన జలుబు, దగ్గు చేసినప్పుడు గొంతులో శ్లేష్మం పేరుకుపోతుంది. దీన్ని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మందుల ద్వారా కన్నా.. ఈ కఫం లేదా శ్లేష్మాన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే తొలగించుకోవడం వుత్తమం.
ముందుగా వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శ్లేష్మం పలచబడి స్వేధం లేదా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. అలాగే, వేడి వేడిగా వుండే సూప్స్ లేదా గ్రీన్ టీ వంటి లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా కూడా శ్లేష్మం కరుగుతుంది.
పిప్పరమెంట్ టీ.. గ్రీన్ టీ మాదిరి మార్కెట్లో అందుబాటులో వుంటుంది. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్లేష్మం పెరగనివ్వకుండా చేస్తాయ్.
పసుపు కలిపిన వేడి వేడి పాలను తీసుకోవడం వల్ల కూడా శ్లేష్మం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఓ గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు వేసి, ఓ స్పూన్ తేనె, మెత్తగా నూరిన నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే, మంచి ఉపశమనం లభిస్తుంది.
శ్లేష్మం దానంతట అదే తగ్గిపోతుందిలే.. అనుకుంటే అది ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. సో, శ్లేష్మాన్ని, కఫాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







