'సాహసం శ్వాసగా..' ఆడియో ఈనెల 17న

- June 12, 2016 , by Maagulf
'సాహసం శ్వాసగా..' ఆడియో ఈనెల 17న

'ఏమాయ చేసావే' చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్‌ మేనన్‌ కలిసి చేస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్ర ఆడియో వేడుకను ఈనెల 17న నిర్వహించనున్నట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. చైతూ సరసన మంజిమ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రేమ, యాక్షన్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎం.రవీందర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com