‘కల్కి’ వెనక ఎన్నో ప్రశ్నలు.!
- June 22, 2024
ఈ ఏడాది ట్రెండింగ్ సినిమాల్లో నిలవబోయే సినిమాగా చెప్పుకోవచ్చు ‘కల్కి’ని. భారీ బడ్జెట్‌తో విపరీతమైన అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘కల్కి’ ప్రమోషన్లు హుషారందుకున్నాయ్.
ఆల్రెడీ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, ఆ ట్రైలర్‌పై ప్రశంసల కన్నా ఎక్కువ విమర్శలే వచ్చాయ్. లేటెస్ట్గా మరో ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్‌కి ఒకింత రెస్పాన్స్ బాగానే వుంది.
ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో, సినీ విమర్శకుల్లో ఎనలేని ప్రశ్నలు. మహా భారతంలో మంచి కోసం జరిగే కురుక్షేత్ర యుద్ధం తరహలోనే కలియుగంలోనూ మంచి కోసం ఓ యుద్ధం జరగబోతోంది. ఆ యుధ్ధం చేయడానికి పుట్టిన వాడే ‘కల్కి’.
అంటే భూమ్మీద మానవజాతిని కాపాడేందుకు పుట్టిన అవతారమే కల్కి. ఆ కల్కి ప్రతిరూపమే ఈ సినిమాలోని ప్రబాస్ పాత్ర.. అయ్యుండాలి. అయితే, ప్రబాస్ పాత్ర పేరు భైరవగా ప్రచార చిత్రాల్లో తెలుస్తోంది.
మానవజాతిని కాపాడేందుకు సుమతి (దీపిక పడుకొనె) కడుపున పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు వచ్చిన అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్)తో భైరవ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు.? భైరవే కల్కి అయితే, ఆ పుట్టబోయే బిడ్డ ఎవరు.? ఆ బిడ్డను కాపాడడానికి అశ్వద్ధామ ప్రయత్నిస్తుంటే, చంపేందుకు ఇంకెవరో ప్రయత్నిస్తుంటారు.
మూడు లోకాలకీ కల్కి అవతారానికీ కనెక్షన్ ఎలా కలిపాడు నాగ అశ్విన్.? కన్విన్సింగ్‌గా కథను చెప్పగలిగాడా.? లేదా.? ప్రబాస్ పాత్ర డ్యూయల్ రోలా.? డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భైరవ ఎలా మంచి కోసం యుద్ధం చేసే కల్కి అవుతాడు.? ఇలాంటి అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటీకీ సమాధానం దొరకాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే ఆగల్సి వుంది. జూన్ 27న ఈ ప్రశ్నలకు అసలు సిసలు సమాధానం దొరుకుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







