ముగ్గురు దుర్మార్గులు ఓ యువతిపై అత్యాచారo..

- June 12, 2016 , by Maagulf
ముగ్గురు దుర్మార్గులు ఓ యువతిపై అత్యాచారo..

ముగ్గురు దుర్మార్గులు ఓ యువతిని ఎత్తుకెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన దేశరాజధాని దిల్లీలో కలకలం రేపింది. నిజాముద్దీన్‌ ప్రాంతంలో 23ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దుండగులు కదులుతున్న కారులో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని దిల్లీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.నిందితులపై కిడ్నాప్‌, అత్యాచారం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com