తనది ‘చిన్న కథ కాదు’ అంటోన్న నివేదా థామస్.!
- June 25, 2024
‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరి అభిమానాన్ని పొందిన బ్యూటీ నివేదా థామస్. తనదైన క్యూట్ అప్పీల్‌తో ‘నిన్ను కోరి’, లేటెస్ట్‌గా ‘వకీల్ సాబ్’, ‘శాకిని డాకిని’ తదితర చిత్రాల్లో నటించిందీ మలయాళీ ముద్దుగుమ్మ.
తాజాగా నివేదా థామస్ లీడ్ రోల్‌లో ఓ డిఫరెంట్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి టైటిల్ ‘చిన్న కథ కాదు’. టైటిలే విచిత్రంగా వుంది. లేటెస్ట్‌గా టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇంకా చిత్రంగా అనిపిస్తోంది.
ఈ పోస్టర్‌ని బట్టి తిరుమల తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నారని అర్ధమవుతోంది. అలాగే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. నంద కిషోర్ అనే కొత్త రక్తం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
కమెడియన్ కమ్ హీరో అయిన ప్రియదర్శి మేల్ లీడ్ పోషిస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్టు 15న ధియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అంతే కాదు తెలుగుతో పాటూ తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండడం విశేషం.

తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







