‘కల్కి’ ప్రమోషన్లు రాజశేఖర్‌కి అలా వర్కవుట్ అయ్యాయన్న మాట.!
- June 25, 2024
            ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ ట్రెండింగ్ అయిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు బర్త్‌డేల సందర్భంగా వారి వారి కెరీర్లలో ఫ్లాప్ సినిమాలు లేదంటే, సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా అప్పట్లో ఆయనకు బిగ్ డిజాస్టర్. కానీ, రీ రిలీజ్లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయర్, బాలకృష్ణ తదితర హీరోల హిట్టు సినిమాల్నీఈ మధ్య రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమానీ రీ రిలీజ్ చేశారు. తాజాగా ప్రబాస్ ‘కల్కి’ మేనియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేనియాలో రాజశేఖర్ ‘కల్కి’ హౌస్‌ఫుల్ అవుతోందట.
అదేంటీ.! ఆ కల్కికీ, ఈ కల్కికీ సంబంధమేంటీ.? అనుకుంటున్నారా.? బుక్ మై షో యాప్‌లో ప్రబాస్ కల్కి కోసం టికెట్లు బుక్ చేసుకుంటుంటే, రాజశేఖర్ ‘కల్కి’కి బుక్ అవుతున్నాయట. అలా బుక్ మై షో మతలబుతో రాజశేఖర్ సినిమా భలే క్యాష్ చేసుకుంటోంది. ఈ రగడపై తనకెలాంటి సంబంధం లేదని తాజాగా సోషల్ మీడియాలో రాజశేఖర్ స్పందించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







