‘సైంధవ్’కీ ‘హిట్’ ఫ్రాంచైజీకీ సంబంధం లేదు.!
- June 25, 2024
‘హిట్’ ఫ్రాంఛైజీల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘సైంధవ్’. అయితే, ‘సైంధవ్’ సినిమాని కూడా ‘హిట్’ సీక్వెల్స్లోనే పడేశారు ఆడియన్స్. కొందరిలో అయితే, అవునా.? కాదా.? అనే అనుమానాలు కూడా వున్నాయ్.
అయితే, ‘సైంధవ్’కీ, ‘హిట్’ ఫ్రాంచైజీలకీ సంబంధం లేదని తాజాగా తెలుస్తోంది. హిట్ సీక్వెల్లో ఇంతవరకూ రెండు సినిమాలొచ్చాయ్. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషించగా, రెండో పార్ట్‌లో అడవి శేష్ లీడ్ రోల్ పోషించాడు.
ఇక త్వరలోనే ‘హిట్ 3 కేస్’ మేకింగ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాల్ని నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పేపర్ బ్యానర్లో రూపొందించిన సంగతి తెలిసిందే.
ఈ మూడో సీక్వెల్ కోసం ఆయనే స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నారట. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన ‘సరిపోదా శనివారం’ రిలీజ్ సన్నాహాల్లో వుంది.
ఈ సినిమా పూర్తిగా కాగానే ఓ వైపు ‘హిట్ 3’, అలాగే, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌నీ పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడట. అలా వచ్చే ఏడాది నాని నుంచి రెండు సినిమాలు రానున్నాయన్న మాట. ఈ ఏడాది ఆల్రెడీ ‘హాయ్ నాన్న’తో హిట్టు కొట్టి, ‘సరిపోదా శనివారం’తో ఆ హిట్టు కంటిన్యూ చేయడానికి రెడీగా వున్నాడు నాని.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







