కువైట్ క్రౌన్ ప్రిన్స్‌ని కలిసిన భారత రాయబారి
- June 27, 2024
కువైట్: హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-సబా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కువైట్‌లోని గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల చీఫ్‌లు మరియు ఆర్మీ, పోలీస్, నేషనల్ గార్డ్ సీనియర్ అధికారులను స్వీకరించారు. మంగళవారం బయాన్ ప్యాలెస్‌లోని అల్-సబా ఫ్యామిలీస్ దివాన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కూడా పాల్గొని యువరాజును కలిశారు. "కువైట్ రాజకుమారుడు షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను బయాన్ ప్యాలెస్‌లో కలవడం గౌరవంగా భావిస్తున్నాను. మూడో ప్రధానికి ఎంపికైన నరేంద్రమోదీకి క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసారు." అని సమావేశం తర్వాత రాయబారి ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







