కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం
- June 29, 2024
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న హరితహారం కార్యక్రమాన్ని 'వన మహోత్సవం'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ లోగోను ముఖ్యమంత్రి ఆమోదించారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







