కల్కి ఇంతటితో ఆగేదే లేదు.!
- June 29, 2024
ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మంచి టాక్‌తో రన్ అవుతోంది. మంచి ఓపెనింగ్స్ రావడం, అనుకున్న అంచనాల్ని అందుకోవడంతో ‘కల్కి’ నిలదొక్కుకోవడం ఖాయమే అని ట్రేడ్ పండితులు ఓ అంచనాకి వచ్చేశారు.
ఆ సంగతి అటుంచితే, నాగ అశ్విన్ తాజాగా ‘కల్కి’ విషయమై ఓ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ‘కల్కి’ ఇంతటితో ఆగేది కాదట. రెండు కాదు, మూడు కాదు నాలుగు కాదు.. ఏకంగా 8 పార్టులుగా ఈ సినిమా తెరకెక్కిస్తాడట.
మొదటి పార్ట్‌కి సీక్వెల్ హింట్ ఎలాగూ వదిలేశారు రెండో పార్ట్‌లో భైరవ (ప్రబాస్), సుమతి (దీపికా పదుకొనె) ఏమయ్యారో తెలుస్తుంది. అలాగే సుమతి సీరమ్ తీసుకున్న సుప్రీం యాష్కిన్ (కమల్ హాసన్) నెక్స్‌ట్ లెవల్ పవర్ ఏంటనే యాంగిల్ చుట్టూ రెండో పార్ట్ స్టోరీ నడవనుందని మొదటి పార్ట్ చివరిలో లీడ్ వదిలిపెట్టాడు నాగ్ అశ్విన్.
సో, ఈ రెండు పార్టుల్లోనూ ప్రబాస్ హీరోగా, కమల్ హాసన్ విలన్‌గా నటించనున్నారు ఇది పక్కా. అయితే, మూడో పార్ట్ నుంచి హీరోలు మారే అవకాశముందట. అలాగే విలన్ రోల్ కూడా మారనుందట. మరి, ఆయా పార్టుల్లో ఏ రేంజ్ టెక్నాలజీని పరిచయం చేస్తాడో నాగ్ అశ్విన్ చూడాలిక. ఈ ప్రచారం మాత్రం ‘కల్కి’పై ఫ్యూచర్ ఇంట్రెస్ట్‌ని సరికొత్తగా క్రియేట్ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







