భద్రాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభం
- July 02, 2024
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఈ సమయంలో స్వామి వారి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలివేయనున్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు..
రాములవారి దర్శన వేళలు చూస్తే..
* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. అనంతరం 8.35 నుంచి 9 వరకు సహస్ర నామార్చన.
* ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అర్చనలు ఉంటాయి.
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు నిత్యకల్యాణం ప్రారంభమవుతుంది.
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు.
* మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
* రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు నివేదన, అనంతరం పవళింపు సేవ ఉంటుంది.
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..







