గర్భధారణ సమయంలో ఆ సమస్యలు సహజమేనా.?
- July 02, 2024
గర్భ ధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చూస్తుంటాం. శారీరక మార్పులతో పాటూ, మానసిక స్థితిలోనూ ఆయా మార్పులొస్తుంటాయ్. దీనంతటికీ కారణం ఈ సమయంలో హార్మోన్లలో రకరకాల మార్పులు సంభవించడమే.
ఈ కారణాల వల్లే గర్భధారణ సమయంలో మహిళల్లో మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, అలసట వంటి శారీరక సమస్యలతో పాటూ, ఒత్తిడి వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ మూడ్ స్వింగ్స్, ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాళ్లు నొప్పులు, కడుపులో నొప్పి, అలసట అనేవి ఈ సమయంలో చాలా సర్వ సాధారణం. వీటికి భయపడకుండా మనసును ధృడంగా చేసుకోవాలి. అలాగే శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా వుంచుకోవడం అత్యవసరం.
అందుకోసం వాటర్ ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇదే సమయంలో మూత్రం ఎక్కువగా స్రవించడం కూడా సర్వ సాధారణ లక్షణమే. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకోవడంతో పాటూ, వాటర్ కంటెంట్ ఎక్కువగా వుండే ఫ్రూట్స్ కూడా రెగ్యులర్‌గా తింటుండాలి.
జ్యూస్‌లు నిమ్మరసం, బత్తాయి రసం వంటివి డైట్‌లో రెగ్యులర్ చేసుకోవాలి. టీ లేదా కాఫీ అలవాట్లు ఎక్కువగా వుంటే వాటికి కాస్త తగ్గించుకుంటే మంచిది. టీ, కాఫీల్లోని కెఫిన్ నిద్రలేమికి, అలసటకి దారి తీస్తుంది.
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తల కింద మెత్తని సౌకర్యవంతమైన దిండును ఉపయోగించాలి. అలాగే కాళ్ల కింద కూడా మెత్తని తేలికైన దిండు ఉపయోగిస్తే మంచిది. పడుకునే ముందు కాళ్లకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది.
రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే డైలీ దినచర్యతో పాటూ, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. డైట్‌లో మసాలా, ఎక్కువ ఆయిలీ ఫుడ్, పంచదార ఐటెమ్స్‌ని ఆచి తూచి తీసుకోవడం వుత్తమం.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







