సమ్మర్ ఫన్.. సరదాగా గడిపేందుకు ఫెస్టివల్స్ ప్రారంభం
- July 12, 2024
మస్కట్: జూలై నెలలో రిఫ్రెష్ వాతావరణం , విభిన్న ఈవెంట్లలో ఆనందదాయకమైన అనుభవాలను అందిస్తూ మూడు వేర్వేరు ఫెస్టివల్స్ ప్రారంభమయ్యయి. అల్ జబల్ అల్ అఖ్దర్‌లోని అల్ దఖిలియా గవర్నరేట్‌లో రుమ్మనా ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ప్రారంభించారు. ధోఫర్ గవర్నరేట్‌లో ధోఫర్ ఖరీఫ్ ఫెస్టివల్ వివిధ పర్యాటక ప్రదేశాలలో సందర్శకులను ఆహ్వానిస్తోంది. “అజ్వా అష్ఖారా” ఫోరమ్ రెండవ ఎడిషన్ అల్ అష్ఖారా పబ్లిక్ పార్క్‌లోని సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ప్రారంభం అయింది. ఇది ఈ సంవత్సరం జూలై 31 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా అనేక ఫన్, ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అజ్వా అల్ అష్ఖారా ఫెస్టివల్ లో భాగంగా గాలిపటాలు ఎగరేసే ప్రదర్శనలు, పారాగ్లైడింగ్, ఫైర్ వర్క్స్, అల్-జఫిన్ వంటి సాంప్రదాయ పోటీలు, తఘ్రుద్ మరియు అల్-రజా వంటి సాంప్రదాయిక ప్రదర్శనలు, గుర్రాల ప్రదర్శన, సంప్రదాయ సముద్ర పోటీలు, ఇంటరాక్టివ్ పోటీలు వంటి అనేక కార్యకలాపాలు కూడా ఉన్నాయి. దోఫర్ గవర్నరేట్ దాని సుందరమైన ప్రకృతి రమణీయ ప్రాంతాలు స్థానికంగా, ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపుపొందాయి. ఇక్కడ వివిధ అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ఈవెంట్లు 90 రోజులలో 180 ఈవెంట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







