100 దేశాల్లో ఆర్ట్ అఫ్ లివింగ్ యోగాడే వేడుకలు

- June 14, 2016 , by Maagulf
100 దేశాల్లో ఆర్ట్ అఫ్ లివింగ్ యోగాడే వేడుకలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్‌తో పాటు మరో వంద దేశాల్లో నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌(ఏఓఎల్‌) సంస్థ ప్రకటించింది. జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ పార్లమెంట్‌లో యోగాడే వేడుకలను రవిశంకర్‌ స్వయంగా ప్రారంభించనున్నారు.
ప్రఖ్యాత యహూది మెనుహిన్‌ హాల్‌లో పార్లమెంటేరియన్ల చేత ఆయన ధ్యానం తదితర కార్యక్రమాలు చేయించనున్నారు. అలాగే వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్‌, కొలంబస్‌, మిన్నెసోటా, శాన్‌ఫ్రాన్సిస్కో, పోర్ట్‌ల్యాండ్‌, సియాటెల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఆయన యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఏఓఎల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.
దిల్లీలో నిర్వహించే యోగా కార్యక్రమంలో 20వేల మంది పాల్గొననున్నారని, ముంబయిలో నాలుగు వేదికల్లో 16,500 మంది పాల్గొంటారని తెలిపింది. ముంబయిలో బోరివాలి ఈస్ట్‌లో జూన్‌ 19, కార్టర్‌ రోడ్‌, బాంద్రా, ఖాండివిలి వెస్ట్‌లోని పోయిసర్‌ జిమ్‌ఖానా, నవీముంబయిల్లో జూన్‌ 21న ఏఓఎల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com