పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం..
- July 14, 2024
ఇంగ్లండ్: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా డబ్ల్యూసీఎల్ 2024 ట్రోపీ విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో అంబటి రాయుడు, యూసుప్ పఠాన్ రాణించారు. చివర్లో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. డబ్ల్యూసీఎల్ 2024 టోర్నీ విజేతగా నిలవడంతో ఐసీసీ టోర్నమెంట్ లలో పాకిస్థాన్ పై టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించినట్లే, ఇండియా ఛాంపియన్స్ పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించి వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ ను గెలుచుకుంది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా.. చివర్లో సోహైల్ తన్వీర్ తొమ్మిది బంతుల్లో 19 పరుగులు జోడించాడు. భారత్ బౌలర్లు అనురీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఛాంపియన్స్ కు మంచి శుభారంభం లభించింది. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు తొలి వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..