ఈ ఏడాది రికార్డు సృష్టించనున్న ఖరీఫ్ ఫెస్టివల్..!
- July 14, 2024
సలాలా: ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్‌కు ఒక మిలియన్ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతానికి పెరుగుతున్న ఆకర్షణను నొక్కిచెప్పే రికార్డ్-బ్రేకింగ్ సంఖ్య అని అధికారులు తెలిపారు. జూన్ 21న ప్రారంభమై మూడు నెలల పాటు కొనసాగే ఈ సంవత్సరం ఉత్సవాల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో వివిధ పర్యాటక ప్రదేశాలను మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నాలతో సన్నాహాలు ప్రారంభమయ్యాయని ధోఫర్ మునిసిపాలిటీ చైర్మన్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహ్సిన్ అల్ ఘస్సానీ తెలిపారు.
ఈ సంవత్సరం ప్రధాన ఆకర్షణలలో సలాలాలోని అవ్కాద్ పబ్లిక్ పార్క్, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అంతర్జాతీయ వినోద గ్రామాలు, ఇంటరాక్టివ్ గేమ్‌లను కలిగి ఉంది. సలాలాలోని అటీన్ ప్లెయిన్ ఆధునిక పర్యాటక నమూనాను అందించడంతోపాటు వ్యాపారవేత్తలకు సేవలందించే 60 సైట్లను ప్రదర్శిస్తున్నారు. అటీన్ స్క్వేర్ ఓపెనింగ్, సందర్శకులను ఆహ్లాదపరుచనుంది. రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం 200 కియోస్క్ లను ఏర్పాటు చేశారు. ఖరీఫ్ ధోఫర్ 2022లో 813,000 నుండి 2023లో 962,000 మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..