ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్
- July 16, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే.. ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు ముందుకు వేసింది.
అందరూ ఊహించినట్లుగానే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఈ పథకాలు ఎప్పుడు అమలవుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో.. ఈ ఉచిత బస్సు పథకం అమలుపై కీలక ప్రకటన రావడం మంచి పరిణామం. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే ఛాన్స్ వచ్చేసినట్లే.
ఆగస్టు 15 అంటే.. ఇంకా నెల టైమ్ ఉంది. అంటే.. మహిళలు మరో నెలపాటూ ఆగాల్సిందే. ఎందుకిలా.. ఆగస్టు 1 నుంచే అమలు చెయ్యవచ్చుగా అని అనిపించవచ్చు. ఐతే.. ఆగస్టు 15 అనేది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కదా.. అలాగే.. మహిళలకు కూడా ప్రయాణ స్వాతంత్ర్యం వచ్చినట్లుగా భావిస్తూ.. ఆగస్టు 15న ఈ పథకాన్ని గ్రాండ్‌గా అమలు చేస్తున్నారు అనుకోవచ్చు. అందువల్ల ఈ నిర్ణయంపై మంచి రెస్పాన్సే వస్తోంది.
సూపర్ సిక్స్ పథకాలు ఇవే:
1. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
2. స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000.
3. ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం.
4. ప్రతి మహిళకీ నెలకు రూ.1,500 (19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు).
5. ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
మొత్తానికి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకి రెడీ అయ్యిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఉచిత బస్సు పథకం.. 6వ పథకంగా ఉంది. దాన్ని అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది కాబట్టి.. ఇక మనం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక ఏపీ మహిళలు, విద్యార్థినులు.. ఆగస్టు 15 నుంచి ఉచితంగా ప్రయాణాలు చెయ్యవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







