భారత్ ను కలవరపెడుతున్న చండీపురా వైరస్.. లక్షణాలు ఇవే?
- July 16, 2024
భారత్: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతులం చేసింది. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.
అయితే ఈ భయంకరమైన మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలోనే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెంది అందరిని భయాందోళనలకు గురిచేస్తుంది.
గుజరాత్ లో చండీపురా అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ చిన్నపిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపడంతో కొద్ది రోజుల వ్యవధిలోనే 6 గురి పిల్లలు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
వైద్యులు సమాచారం ప్రకారం ఈ వైరస్ మొదట జ్వరానికి కారణమవుతుందని తెలిపారు. ఇక ఈ వైరస్ ఈగలు దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు.
ఈ వ్యాధి వ్యాప్తి చెందిన పిల్లల మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మెదడు మొత్తం వాపు రావడమే కాకుండా రోజురోజుకు వారి పరిస్థితి మరింత క్షీణించి పోతుందని తెలిపారు. ఇలా ఈ వైరస్ వ్యాప్తి చెందితే తీవ్రమైనటువంటి జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ వైరస్ 1966వ సంవత్సరం మహారాష్ట్ర నాగపూర్ లో చండీపూర్ అనే గ్రామంలో మొదటిసారి బయటపడింది. 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు ఈ వైరస్ బారిన పడి చనిపోవడంతో ఈ వైరస్ కి చండీపూర్ అనే పేరు వచ్చింది.
ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో దోమలు ఈగలు పెరగడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి, అలాగే పూల కుండీలలో కూడా నీరు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వైరస్ ను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!