తీహార్ జైలులో కవితకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- July 16, 2024
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం అనారోగ్యం పాలయ్యారు.
గమనించిన జైలు అధికారులు చికిత్స నిమిత్తం కవితను వెంటనే దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసిన ఆమెకు నిరాశే ఎదురువుతోంది. ఈ క్రమంలో కవిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం. కవిత అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







