కేజీఎఫ్ బ్యూటీకి నాని సినిమాలో ఛాన్స్.!

- July 21, 2024 , by Maagulf
కేజీఎఫ్ బ్యూటీకి నాని సినిమాలో ఛాన్స్.!

‘కేజీఎఫ్’ సినిమాతో పిచ్చ క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఆ సినిమా కోసం ఆ టైమ్‌లో వచ్చిన ఏడు ప్రాజెక్టుల్ని చేజార్చుకున్నానని ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పిందీ అందాల భామ.
అయితే, ఆ సినిమాతో క్రేజ్ మాత్రమే దక్కించుకుంది. అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అయ్యాయ్ శ్రీనిధి శెట్టికి. ‘కేజీఎఫ్’ తర్వాత ‘కోబ్రా’ సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా. కానీ, ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోవడంతో రేస్‌లో వెనకబడిపోయింది.
ప్రస్తుతం టాలీవు‌డ్‌లో ఈ అమ్మడికి వరుస అవకాశాలొస్తున్నాయ్. కానీ, స్టార్‌డమ్ దక్కించుకునే అవకాశాలు ఏమాత్రం కావవి. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తోంది.
తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. నాని సొంత నిర్మాణంలో రూపొందిన ‘హిట్’ సిరీస్‌లో మూడోది రేపో మాపో పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది.
ఈ సారి నాని నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటిస్తున్నాడు ‘హిట్ 3’ కోసం. ఈ పార్ట్‌లో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఎంచుకున్నారట. ఒకవేళ ఈ సిరీస్ హిట్టయితే, శ్రీనిధి శెట్టికి టాలీవుడ్‌ పుణ్యమా అని మళ్లీ రైజింగ్ స్టార్ట్ అయినట్లే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com