సౌదీ అరేబియాలో 12,706 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్

- July 26, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో 12,706 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్

రియాద్: క్రాంక్ షాఫ్ట్ మిక్సింగ్ లో లోపం కారణంగా 12,706 టయోటా మరియు లెక్సస్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ టార్క్ కోల్పోవడం లేదా పూర్తిగా ఇంజిన్ షట్‌డౌన్‌కు దారితీయవచ్చనీ ప్రమాద ఇది పెంచుతుందని వెల్లడించింది.  రీకాల్‌లో 2022-2023 మోడల్‌ల నుండి 11,325 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు మరియు 2022-2023 మోడల్‌ల నుండి 1,381 లెక్సస్ LX600 & LX500 వాహనాలు ఉన్నాయి. అవసరమైన మరమ్మతులను ఉచితంగా షెడ్యూల్ చేయమని స్థానిక డీలర్ లను ఆదేశించింది. రీకాల్ చేయబడిన వాహనాల వినియోగదారులు స్థానిక డీలర్ అబ్దుల్ లతీఫ్ జమీల్ కంపెనీని ల్యాండ్ క్రూయిజర్‌ల కోసం టోల్ ఫ్రీ నంబర్ 8004400055 మరియు లెక్సస్ కోసం 8001220022 నంబర్‌లో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com