8వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ‘అల్-ఫావ్’
- July 28, 2024
రియాద్: యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో రియాద్ ప్రాంతంలో ఉన్న అల్-ఫా ఆర్కియాలజికల్ ఏరియా యొక్క కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌ను నమోదు చేసారు. ఇది ఈ గుర్తింపు పొందిన ఎనిమిదవ సౌదీ సైట్‌గా నిలిచింది. రియాద్‌కు దక్షిణంగా ఉన్న వాడి అడ్-దవాసిర్లో ఉన్న అల్-ఫావ్ ఆర్కియోలాజికల్ ఏరియా, తువైక్ పర్వత శ్రేణుల కూడలిలో 275 కిమీ² బఫర్ జోన్‌తో 50 కిమీ² విస్తరించి ఉంది. ఈ ప్రదేశంలో చరిత్ర పూర్వ కాలం నాటి విభిన్న పురావస్తు ఆధారాలు, స్పష్టమైన నిర్మాణాలతో కూడిన పెద్ద సమాధులు, పురాతన కారవాన్ నగరం నుండి సాంస్కృతిక, నిర్మాణ అంశాలు, పురాతన నీటిపారుదల వ్యవస్థలతో కూడిన ఒయాసిస్, ముఖ్యమైన రాక్ ఆర్ట్ మరియు శాసనాలు ఉన్నాయి.
సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా విజన్ 2030 లక్ష్యాన్ని సాధించినట్లు ప్రకటించారు. "యునెస్కోలో ప్రపంచ వారసత్వ జాబితాలో అల్-ఫావ్ ఆర్కియాలజికల్ ప్రాంతం సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని నమోదు చేయడం ద్వారా సాంస్కృతిక రంగం విజన్ 2030లో దాని లక్ష్యాన్ని సాధించింది. క్రౌన్ ప్రిన్స్ మార్గదర్శకత్వంతో సౌదీ సైట్లు ప్రపంచ వారసత్వ జాబితాలో నమోదు చేయబడ్డాయి." అని పేర్కొన్నారు.
అల్-ఫావ్ చేరడంతో UNESCO వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో అల్-హిజ్ర్ ఆర్కియోలాజికల్ సైట్ (2008), అట్-తురైఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ అడ్-దిరియా (2010), హిస్టారిక్ జెడ్డా (2014), రాక్ ఆర్ట్ ఇన్ హేల్ రీజియన్ (2015), అల్-అహ్సా ఒయాసిస్ (2018), హిమా కల్చరల్ ఏరియా (2021), 'ఉరుక్ బని మారిడ్ ప్రొటెక్టెడ్ ఏరియా (2023) ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







