భారత్ చేజారిన ఆసియా కప్..
- July 28, 2024
శ్రీలంక: మహిళల ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియాపై శ్రీలంక మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 165-6 స్కోర్ చేసింది.
భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ 16, స్మృతి మంధాన 60, ఉమా ఛెత్రీ 9, హర్మన్ ప్రీత్ 11, రొడ్రిగ్యుస్ 29, రిచా ఘోష్ 30, పూజా 5 (నాటౌట్), రాధా జాదవ్ 1 పరుగులు తీశారు.
లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే గెలుపొందింది. శ్రీలంక జట్టులో చమరి 61, హర్షిత 69 ధాటిగా ఆడారు. టీమిండియా బౌలర్లలో దీప్తి ఒక వికెట్ తీసింది.
భారత జట్టు:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్
శ్రీలంక జట్టు:
విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, హాసిని పెరీరా, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..