ఒమన్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ అప్డేట్..వ్యాపారులకు కొత్త సేవలు..!
- July 29, 2024
మస్కట్: ఒమన్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు అందించే అనేక సేవల కోసం కొత్త అప్డేట్ ను ప్రవేశపెట్టినట్లు వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అప్డేట్ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపార రంగ సేవలను సరళీకృతం చేయడం, పెట్టుబడిదారులు మరియు వ్యాపార యజమానుల కోసం సమయం ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని వెల్లడించింది. ఇది స్థానిక మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తాజా మెరుగుదలలలో వాణిజ్య నమోదు, వాణిజ్య రిజిస్ట్రీ సమాచారం అప్డేట్, వాణిజ్య రిజిస్ట్రీ యాజమాన్యాన్ని బదిలీ చేయడం వంటి సేవలు ఉన్నాయి. దీంతోపాటు, విదేశీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టం కింద లైసెన్సింగ్ అప్లికేషన్‌లు మరియు కంపెనీల రిజిస్ట్రేషన్‌కు అప్డేట్ లు చేసినట్టు పేర్కొంది. 2024 ప్రథమార్థంలో ఒమన్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా పూర్తి చేసిన లావాదేవీల సంఖ్య 487,300కి చేరుకున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







