ప్రభాస్ ‘రాజాసాబ్’ గ్లింప్స్ వచ్చేసింది..
- July 29, 2024
హైదరాబాద్: ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో భారీ 1100 కోట్ల హిట్ కొట్టి బోలెడన్ని రికార్డులు సృష్టించారు. కల్కి విజయం పై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి సినిమా తర్వాత కూడా ప్రభాస్ కి భారీ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు.
మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ సినిమాని రిలీజ్ చేస్తామని గతంలో మారుతి ప్రకటించాడు. ఆల్రెడీ సగం షూటింగ్ అవ్వగా మిగిలిన భాగం ఆగస్టులో మొదలవుతుందని సమాచారం. గతంలో రాజాసాబ్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. నిన్న నిర్మాణ సంస్థ రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చింది.
తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో ప్రభాస్ స్టైలిష్ గా బండి మీద వచ్చి పూలతో తనకి తాను దిష్టి తీసుకున్నాడు. హారర్, రొమాంటిక్, కామెడీ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇక సంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఈ గ్లింప్స్ తో ప్రకటించారు. మీరు కూడా రాజాసాబ్ గ్లింప్స్ చూసేయండి..
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







