ఆగస్టులో బ్యాంకులకు సెలవులు..
- July 29, 2024
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది.సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణంగా, బ్యాంకు బ్రాంచ్‌లు ప్రతి ఇతర శనివారం (రెండవ, నాల్గవ) అన్ని ఆదివారాలు పనిచేయవు. ప్రభుత్వ సెలవులతో పాటు రాష్ట్ర-నిర్దిష్ట పండుగల సమయంలో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. క్రిస్మస్ వంటి జాతీయ పండుగల సమయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.
వచ్చే ఆగస్టు నెలలో సెలవుల దినాలను పరిశీలించి బ్యాంక్ పనులను నిర్ణయించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవులను మూడు కేటగిరీల కింద విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులు, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు, బ్యాంకుల అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి అందులో ఉంటాయి. వచ్చే ఆగస్టులో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టులో జాతీయ, ప్రాంతీయ సెలవుల పూర్తి జాబితా:
- ఆగస్టు 3 (శనివారం) : కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు క్లోజ్
- ఆగస్టు 4 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్
- ఆగస్ట్ 8 (సోమవారం) : గ్యాంగ్‌టక్‌లో, టెండాంగ్ లో రమ్ ఫాత్ సందర్భంగా బ్యాంకులు మూసివేత
- ఆగస్టు 10 (శనివారం) : రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
- ఆగస్టు 11 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
- ఆగస్టు 13 (మంగళవారం) : దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకుల మూసివేత
- ఆగస్టు 15 (గురువారం) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు
- ఆగస్టు 18 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
- ఆగస్టు 19 (సోమవారం) : రక్షా బంధన్ సందర్భంగా త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
- ఆగస్టు 20 (మంగళవారం) : శ్రీనారాయణ గురు జయంతిని పురస్కరించుకుని కొచ్చిలో బ్యాంకులు మూతపడనున్నాయి.
- ఆగస్టు 24 (శనివారం) : నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్
- ఆగస్టు 25 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
- ఆగస్టు 26 (సోమవారం) : జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి సందర్భంగా గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవుదినం.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







