క్లాష్‌పై క్లారిటీ ఇచ్చిన ‘మిస్టర్ హరీష్ శంకర్’.!

- July 30, 2024 , by Maagulf
క్లాష్‌పై క్లారిటీ ఇచ్చిన ‘మిస్టర్ హరీష్ శంకర్’.!

సోలో రిలీజ్ అంటూ పండగ చేసుకున్నాడు మొదట ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడయితే ‘పుష్ప 2’ వాయిదా పడిందో, ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఆ డేట్‌ని లాక్ చేసుకున్నాడు ఇస్మార్ట్ శంకర్.

అప్పటికి మరే సినిమా ఆ డేట్‌లో రిలీజ్‌కి లేదు. దాంతో సోలో రిలీజ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’దే.. అది కూడా ప్రైమ్ టైమ్ అనుకున్నారు. తమకి బాగా కలిసొచ్చే అంశమే అనుకుని సంబరపడ్డారు. కానీ, ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు.

భారీ అంచనాల నడుమ ‘మిస్టర్ బచ్చన్’ ఆ డేట్‌లోకి వచ్చి కూర్చుంది. దాంతో డైరెక్టర్ హరీష్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు రామ్ అండ్ పూరీకి చెందిన ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.

దాంతో, సోషల్ మీడియాలో తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ క్లాష్ కావాలని వచ్చింది కాదు. రావల్సి వచ్చింది. అందుకు పూరీ జగన్నాధ్‌ మరియు రవితేజలతో మాట్లాడాం.. అయినా డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ స్థాయి వేరు. స్థానం వేరు.. ఆయన సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. అలాగే నా సినిమా కూడా.. అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారాయన.

టెక్నికల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఇతరత్రా కారణాల వల్ల అదే డేట్‌కి రావల్సి వచ్చింది. ముందుగా అనుకోలేదు. ఆ డేట్ అనుకున్న తర్వాత టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పనులు వేగవంతం చేయాల్సి వచ్చింది.. అంటూ తమ కష్టాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారాయన. అయినా కంటెంట్ బాగుంటే ఆటోమెటిగ్గా సినిమా హిట్టవుతుంది. ఎంత పోటీ వున్నా సరే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com