టాలీవుడ్ కోసం ‘ఆకాశంలో ఒక తార’నంటోన్న మలయాళ హీరో.!
- August 01, 2024
మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు దుల్క్ సల్మాన్. అందుకు కారణం ఆయన తెలుగులో నటించిన ‘సీతారామం’ మూవీనే.
ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే, తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించిన మరో చిత్రం ‘మహానటి’ కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ ‘కల్కి’ సినిమాలోనూ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మరో తెలుగు డైరెక్టర్‌తో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. అదే ‘ఆకాశంలో ఒక తార’. టైటిల్ డిఫరెంట్‌గా వుంది. ఈ సినిమాలోని దుల్కర్ పాత్ర కూడా విభిన్నంగా వుండేలా అనిపిస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది.
రైతు గెటప్‌లో దుల్కర్ నటిస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా అర్ధమవుతోంది. గతంలో ‘ఇష్క్ కాదల్ లవ్’, ‘సావిత్రి’ వంటి రేర్ స్టోరీస్‌తో సినిమాలు తెరకెక్కించిన పవన్ సాధినేని ఈ సినిమాకి దర్శకుడు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. అన్నట్లు దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!