శరవేగంగా వెంకీ అనిల్ రావిపూడి 3.!

- August 01, 2024 , by Maagulf
శరవేగంగా వెంకీ అనిల్ రావిపూడి 3.!

అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఫ్రాంచైజీ మూవీస్‌గా రూపొందిన సినిమాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. ఆ తర్వాత అనిల్ రావిపూడి మళ్లీ వెంకీ మామతో సోలోగా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఇటీవలే లాంఛ్ చేసి, రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మొదటి పార్ట్ షూట్ కంప్లీట్ అయ్యింది. తొలి షెడ్యూల్‌లో వెంకటేష్ లేకుండానే కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించేశాడు అనిల్ రావిపూడి.
ఇక త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఆగస్టు 9 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కానుందట. ఈ షెడ్యూల్‌ని పొల్లాచిలో చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ మొత్తం వెంకటేష్‌పై అత్యంత కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట అనిల్ రావిపూడి.
ఈ సినిమాని మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాడట అనిల్ రావిపూడి. అలాగే, తన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పుష్కలంగా వుండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com