గంజాయి మత్తులో కారుకు నిప్పు..రిటైర్డ్ వ్యక్తికి శిక్ష..!
- August 02, 2024
మనామా: పదవీ విరమణ చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పంటించినందుకు, గంజాయిని కలిగి ఉన్నందుకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించనుంది. కోర్టు తీర్పు విచారణను ఆగస్టు 12కి షెడ్యూల్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితుడు మరొక వ్యక్తికి చెందిన కారుకు నిప్పు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సదరు వ్యక్తి కారుకు నిప్పు పెట్టి పారిపోయినట్టు గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ అతను ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడని వైద్య పరీక్షలో తేలింది. ఆగస్టు 12న కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







