‘బృంద’గా త్రిషను అభినందించాల్సిందే.!
- August 03, 2024
స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ మెయిన్ లీడ్‌లో వచ్చిన వెబ్ సిరీస్ ‘బృంద’. లేటెస్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి వచ్చింది ఈ వెబ్ సిరీస్.
ట్రైలర్ చూస్తే.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర త్రిషది అనుకున్నాం. కానీ, సిరీస్ చూశాకా తెలిసింది. ఓ సాధారణ ఎస్సై పాత్ర. కొత్తగా జాబ్‌లోకి రావడంతో స్టేషన్లో సరైన గుర్తింపు, గౌరవం కూడా దక్కవు త్రిషకి.
అయినా ఓర్చుకుని తనదైన డ్యూటీ తాను చేసుకుపోతుంటుంది. వాష్ రూమ్ పక్కనే ఆమె క్యాబిన్.. వాష్ రూమ్‌లోంచి వచ్చిన మగ పోలీస్ ఆఫీసర్లు కనీసం పక్కనే లేడీ పోలీసాఫీసర్ వుందని, డోర్ వేసి బయటికి రావాలన్న కనీసపాటి కన్సన్ కూడా వుండదు.
అలాంటి పాత్రలో తనదైన ఇంటెన్స్ చూపించింది త్రిష. అలాంటి పరిస్థితుల్లో చాలా కాంప్లికేటెడ్ అయిన ఓ మర్డరీ మిస్టరీని ఛేదిస్తుంది బృంద.
దాదాపు ఐదు గంటల రన్ టైమ్‌తో సాగిన ఈ సిరీస్‌ని దేవుడ్ని నమ్మే వాళ్లను, దేవుడి గురించి ప్రచారం చేసేవాళ్లపై మాస్ మర్డర్స్ చేసే ఓ నరరూప రాక్షసుడి ఆసక్తికరమైన కథగా ‘ డిజైన్ చేశారు.
కథలో టర్న్ అయిన ట్విస్టులు, త్రిష పర్ఫామెన్స్ సపోర్టింగ్ రోల్స్ పోషించిన నటీనటుల పాత్రలు అన్నీ చక్కగా సెట్ అయ్యాయ్.
స్టార్ హీరోయిన్ అంటే, ఎక్కడ లేని ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ, వెబ్ సిరీస్ ప్యాటర్న్‌లోనే ఎక్కడా రాజీ పడకుండా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ‘బృంద’ వెబ్ సిరీస్‌కి. త్రిషలోని మరో యాంగిల్ ప్రతిరూపం ఈ వెబ్ సిరీస్.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







