పాయల్ రాజ్ పుత్ కెరీర్‌ని ఓటీటీ రక్షించినట్లే.!

- August 03, 2024 , by Maagulf
పాయల్ రాజ్ పుత్ కెరీర్‌ని ఓటీటీ రక్షించినట్లే.!

వెండితెర పై పెద్దగా అవకాశాల్లేని చాలా మంది నటీ నటులకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ మంచి అవకాశంగా మారుతున్న తరుణమిది. ఆ నేపథ్యంలోనే ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కీ ఓ మంచి అవకాశం దక్కింది ‘రక్షణ’ సినిమా రూపంలో.
ఈ సినిమాలో ఏసీపీ ఆఫీసర్‌గా ఓ పవర్ ఫుల్ రోల్ పోషించింది పాయల్ రాజ్‌పుత్. ఈ తరహా ఇంటెన్స్ వున్న పాత్రల్లో పాయల్ బెస్ట్ ఎంపిక అని ఆమె తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది.
అయితే బ్యాడ్ లక్.! ఆ తర్వాత అలాంటి పాత్రలు పాయల్‌‌కి దక్కలేదు. అయితే, ‘రక్షణ’ రూపంలో ఓ మంచి సినిమా పడ్డట్లే పాయల్ రాజ్‌పుత్‌కి. అయితే, ఇంకా చాలా స్కోపుంది ఈ సినిమాలో. ఎక్కువ స్పాన్ తీసుకోకుండా.. డైరెక్ట్‌గా క్రైమ్ స్టోరీ చుట్టూనే స్టోరీ నడిపించేశాడు డైరెక్టర్.
పాయల్ వంటి హీరోయిన్‌ని తీసుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ యాంగిల్స్ కూడా ఆలోచించి వుంటే బావుండేది. కానీ, ఆ యాంగిలే టచ్ చేయలేదు. ఓవరాల్‌గా ఓటీటీలో అయితే, ‘రక్షణ’ ఓకే. ధియేటర్లలో అందుకే వర్కవుట్ కాలేదు.
ఏది ఏమైతేనేం, ఈ తరహాలో  ఓటీటీ కంటెంట్స్‌కి అయినా పాయల్ ఓకే చెబితే ఫ్యూచర్‌లో ఆమె కెరీర్‌కి ఏమాత్రం ఢోకా వుండదు.. అనేది ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com