కోల్‌కతాని ముంచెత్తిన వరదలు..

- August 04, 2024 , by Maagulf
కోల్‌కతాని ముంచెత్తిన వరదలు..

కోల్‌కతా: కోల్‌కతాని భారీ వరదలు మొచ్చేత్తాయి. దీంతో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జలమయ్యింది. రన్‌ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. హౌరా, సాల్ట్‌ లేక్, బారక్‌పూర్‌లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. విమానాశ్రయ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయం రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. కోల్‌కతాతోపాటు పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్‌లో కుండపోత వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com